Friday, December 18, 2015

మహామనిషి తుర్లపాటి మల్లేశం

 (15వ వర్థంతి సందర్భంగా నివాళి)

ఈరోజు మా నాన్నగారు తుర్లపాటి వెంకటమల్లికార్జున వరప్రసాదరావు - (టీవీఎంవీ ప్రసాదరావు - మల్లేశం)గారి ఆబ్దికం. విక్రమనామ సంవత్సరం మార్గశిరమాసం శుక్లపక్షం నవమిరోజున వారు లింగైక్యం చెందారు. అంటే ఆంగ్లసంవత్సరాల ప్రకారం  లింగైక్యమైన రోజు  డిసెంబర్ 5 2000 సంవత్సరం. 15వ వర్థంతి సందర్బంగా మా కుటుంబసభ్యులమందరం  శ్రద్ధాంజలి ఘటించాము.

 ఆజానుబాహులు, స్ఫురధ్రూపి, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సమస్యలనైనా ఎదురొడ్డి పోరాడగలిగిన ధీశాలి అయిన మా పిత్రుదేవులకు ప్రణమిల్లుతున్నాము.  మా అమ్మగారు  స్వరాజ్యలక్ష్మి (ఫిబ్రవరి 28, 1986లో లింగైక్యం చెందారు) తో వారు దిగిన ఫోటోను కూడా ఇక్కడ ఉంచుతున్నాము. మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత (నందిగామలో) పార్థివ శరీరాన్ని స్వస్థలమైన అడవిరావులపాడుకు తీసుకువెళ్ళాము. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశాము.

సేవాతత్పరులు

  కృష్ణాజిల్లా నందిగామ మండలంలోని  అడవిరావులపాడు గ్రామాభివృద్ధికి మల్లేశం గారు ఇతోధికంగా సేవలందించారు. ఆయన దేవాదాయధర్మాదాయ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేసినప్పటికీ, నిత్యం శివపూజలు చేస్తున్నప్పటికీ వారి మనసులో అన్యమతాల పట్ల ద్వేషభావం ఉండేది కాదు. అందుకే గ్రామంలో చర్చ్  నిర్మాణం సమయంలో  విరాళం అందజేశారు. ఆయన లింగైక్యం చెంది 15ఏళ్లు అవుతున్నా అనేక మంది గుండెల్లో ఆయన  నిలిచే ఉన్నారు.

నిరుద్యోగలపాలిట `దేవుడు'

  దేవాలయాల్లో కానుకలను హుండీలోనే వేయాలనీ, అప్పుడే అవి దేవాలయ అభివృద్ధికి దోహదకారి అవుతాయని అంటుండేవారు. హారతి పళ్లెంలో వేస్తే అవి కేవలం ఒక వ్యక్తికి (పూజారికి) మాత్రమే చెందుతాయనీ   చెప్పేవారు.  అనేక దేవాలయాల్లో పేదరికంతో బాధపడుతున్న అర్చక కుటుంబాలవారికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే ఇతర కులాలవారికి కూడా తనకు చేతనైన పరిథిలో ఉద్యోగాలు ఇప్పించేవారు. మా నాన్నగారు నాకు తెలిసినంతవరకు బెజవాడ కనకదుర్గమ్మ, గుంటూరు వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, మంగళగిరి పానకాలస్వామివారి ఆలయం, వేదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వంటి చోట్ల ఈఓగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ముక్త్యాల  సంస్థానంలో మేనేజర్ గా కొన్నాళ్లు పనిచేశారు.

మాట కటువు, మనసు వెన్న

  ఎవరైనా వచ్చి, `నా పరిస్థితి బాగోలేదు, సాయం చేయండయ్యా' అని అడిగితే చాలు, తన జేబులో ఎంత ఉంటే అంత ఇవ్వడం నేను కళ్లారా చూశాను. వ్యక్తి స్వార్థం, కుటుంబ స్వార్థం కంటే, సమాజహితమే గొప్పదని చెబుతుండేవారు. మాట కటువుగా ఉన్నా, మనసు వెన్నపూస. కొంతమంది ఆయన మాటతీరుతో ఆయనది పాషాణ హృదయమనీ, ఆయనలో ప్రేమానురాగాలు లేవని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. ప్రేమను వ్యక్తీకరించినమాత్రానే వారిలో ప్రేమ పొంగుతుందని అనుకోవడం భ్రమ. ఆ భ్రమ ముసుగులు తొలిగించి చూస్తే, హృదయంలోపల నిండుగా ఉన్న ప్రేమ సాక్షాత్కరిస్తుంది. అలాంటి ప్రేమను వారి నుండి నేను ఆస్వాదించగలిగాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కుటుంబంలో ఎన్ని ఒడుదుడుకులు తలెత్తినా, మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చవుతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా మనోధైర్యాన్ని మాత్రం ఏనాడు విడువలేదు.

ధర్మమూర్తి 

  న్యాయం, ధర్మం ఆయనకు ఆరో ప్రాణం. అధర్మంగా ఎవరు మాట్లాడినా వారికి కోపం చిర్రెత్తుకొచ్చేది. అసలే ముక్కుసూటి మనిషి, ఆపైన నిజాయితీపరులు...అందుకే ఆయనవద్దకు వచ్చి అక్రమాల గురించి మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించేవారు కారు. ఓసారి ఫోటో చూడండి. ఆ ముక్కుసూటి తనం మీకే తెలుస్తుంది. మా ఇంట్లో అన్నయ్య, అక్కయ్య, నేను మా నాన్నగారి దగ్గర ఎక్కువగా మాట్లాడేవారామేకాదు. పెద్దయ్యాక కూడా ఏదైనా విషయం వారి చెవిన వెయ్యాలంటే ఒకటికి నాలుగుసార్లు రిహార్సల్స్ వేసుకునేవారం. మా అమ్మగారే చాలా సందర్భాల్లో వారధిగా నిలిచేవారు.
 
                                                                     - తుర్లపాటి నాగభూషణరావు
                                                                        9885292208

Saturday, December 12, 2015

నేతాజీ మరో 20ఏళ్లకు పైగానే క్షేమంగా ఉన్నారా ?!

నేతాజీ 1945లో మరణించలేదు. మరో 20ఏళ్లకు పైగానే క్షేమంగా ఉన్నారని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం దొరికింది. 1966 తాష్కెంట్ లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రితో దిగిన గ్రూప్ ఫోటోనే నిదర్శనం. పైగా, ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ కూడా ఇదే నిజమని తేల్చి చెప్పింది. మరి ప్రధాని మోదీకి మరో అస్త్రం దొరికినట్లేనా ? నేతాజీ మరణం వెనుక రహస్యాలు తేలితే దేశ రాజకీయ చరిత్రలో హీరోలనుకున్నవారు విలన్లుగా మారతారా? ఏమో...చూడాల్సిందే...
https://www.telugu360.com/te/subhas-chandra-bose/

Friday, December 11, 2015

ఇక్కడ `రానా'నే బాహుబలి !



బాహుబలిలో రానా విలన్ పాత్ర (భల్లాల దేవ) పోషించి ఉండవచ్చు. కానీ, చెన్నై వరద బాధితులను ఆదుకోవడం కోసం పెద్దఎత్తున నిత్యావసర వస్తుసముదాయాన్ని సేకరించడంలో మాత్రం రానా దగ్గుబాటి హీరో అనిపించుకుంటున్నాడు. నిత్యావసర వస్తువులను లారీలోకి లోడ్ చేయగానే రామానాయుడు స్టూడియోస్ లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో `సూత్రధారి `రానా'నే నిజమైన బాహుబలి' అన్న ప్రంశంసలు అందుకున్నాడు.

https://www.telugu360.com/te/rana-is-now-real-hero-bahubali/

Sunday, March 16, 2014

డింకుటక పార్టీకి మద్దతు ప్రకటించిన సంతోష్ కృష్ణ

డింకుటక పార్టీలో చేరినందుకు ఈ బోకే అందుకోండి

జర్నలిస్ట్ మిత్రుడు  సంతోష్ కృష్ణ మన డింకుటక పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. డింకుటక ఆశయాలను తెలుసుకున్న తర్వాత వారు పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపించారు. వారికి ఇదే మా ఆహ్వానం.
వారు మెయిల్ ద్వారా నాకు పంపిన సమాచారం ...
పేరు  సంతోష్ కృష్ణ, హైదరాబాద్.. ప్రస్తుతం ఎన్ టి వి లో సీనియర్ సబ్ ఎడిటర్ గా వుద్యోగం.. ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణాత్మక మాటల ద్వారా నా పరిజ్ఞానం మేరకు మన డింకు టక కార్యకర్తలకి అందించగలను.
  

Saturday, March 15, 2014

DinkuTaka Party NRI Coordinator BN Rao

డింకుటక పార్టీ ఎన్ ఆర్ ఐ కోఆర్డినేటర్ గా బి.ఎన్. రావు

 బుద్దవరపు నరసింహారావుగారు (వీరిని రావుగారనే అంతా పిలిస్తుంటారు. వీరు తరంగ డిజిటల్ నెట్ వర్క్స్ సీఈఓగా ఉన్నారు. రావుగారు మన డింకుటకా పార్టీకి మేసేజ్ పంపారు. అదేమంటే- Count me in for all NRI coordination. అయ్యా, రావుగారూ మీలాంటి మేథావులు తప్పకుండా డింకుటక పార్టీలో చేరాలి, కోఆర్డినేషన్ బాధ్యతలు స్వీకరించాలి. మీరు ముందుకు రావడంతో ఇతర దేశాల్లో డింకుటక (అంతర్జాతీయ రాజకీయ వేదిక) బలోపేతమవుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీకు సగౌరవంగా ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాము. మీకు శుభాభివందనాలు - మీ నాగ్ (డింకుటక పార్టీ అధ్యక్షుడు)

I am DinkuTaka, Are you?

డింకుటక పార్టీ అభిమానులారా, మీరంతా మా పార్టీలో చేరండి, మద్దతు పల్కండి. అందుకు మీరు చేయాల్సిందల్లా పేస్ బుక్ లో లేదా బ్లాగ్ లో ఈ సమాచారం కింద కామెంట్స్ రూపంలో ` I am DinkuTaka, Are you? అని తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో టైప్ చేయండి. అంతే మీరు డింకుటక పార్టీలో చేరినట్టే.
  డింకుటక పార్ టీ ఆవిర్భావ కార్యక్రమం తెలుగు తరంగా ఇంటర్నెట్ రేడియో స్టేషన్ లో మార్చి 13వ తేదీ (2013) సాయంత్రం 4-45 నిమిషాలకు జరిగింది. పార్టీ ఆవిర్భవించిన కొద్ది గంటల్లోనే విశేష స్పందన లభించింది. సోషల్ నెట్ వర్క్ ద్వారా అనేక మంది తాము డింకుటకాకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞాతిభివందనాలు.
  మన పార్టీ - డింకుటక ఎవరికీ తలవొంచదు. మరే ఇతర పార్టీలోనూ చేరదు. పైగా దీనికి ఎల్లలు లేవు. రాష్ట్ర, దేశ సరిహద్దులు చీల్చుకుని ఖండాంతరాలకు దూసుకుపోగల సత్తా ఈ డింకుటకాకు ఉంది. అంతేకాదు, ఈ పార్టీకి భాషాపరమైన అడ్డంకులు కూడా లేవని సవినయంగా తెలియజేస్తున్నాను. హిందీ, మరాఠీ, పంజాబీ, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలోనైనా డింకుటక పార్టీ పెట్టుకోవచ్చు. మనందరి లక్ష్యం ఒకటే, ఏదేశమైనా, ఏ ప్రాంతమైనా అవినీతి రహిత నవ్య సమాజాన్ని స్థాపించడమే.
                                                       మీ - నాగ్ (డింకుటక పార్టీ అధ్యక్షుడు)

Friday, March 14, 2014

కేజ్రీవాల్ చీపురు కంటే చేట ఎలా పవర్ ఫుల్ ?

డింకుటక పార్టీకి చేట గుర్తును ఎందుకు ఎంపికచేశారని చాలామంది అడుగుతున్నారు. 
ఎందుకంటే, చీపురు (అవినీతి) చెత్తను చిమ్మేస్తుంది.
నిజమే. కానీ మా చేట అలా చిమ్మేసిన చెత్తను ఆవల ఎత్తి పారేస్తుంది. 
మళ్ళీ కనిపించనంత దూరానికి విసిరి పారేస్తుంది. 
చెత్త చిమ్మేసి మూలన ఉంచినా అవినీతి గాలికి మళ్ళీ గదంతా పేరుకుపోవచ్చు. 
అందుకే మా చేటకే మీరంతా సపోర్ట్ చేయాలని డింకుటక అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతున్నాను. - మీ నాగ్