Sunday, March 16, 2014

డింకుటక పార్టీకి మద్దతు ప్రకటించిన సంతోష్ కృష్ణ

డింకుటక పార్టీలో చేరినందుకు ఈ బోకే అందుకోండి

జర్నలిస్ట్ మిత్రుడు  సంతోష్ కృష్ణ మన డింకుటక పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. డింకుటక ఆశయాలను తెలుసుకున్న తర్వాత వారు పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపించారు. వారికి ఇదే మా ఆహ్వానం.
వారు మెయిల్ ద్వారా నాకు పంపిన సమాచారం ...
పేరు  సంతోష్ కృష్ణ, హైదరాబాద్.. ప్రస్తుతం ఎన్ టి వి లో సీనియర్ సబ్ ఎడిటర్ గా వుద్యోగం.. ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణాత్మక మాటల ద్వారా నా పరిజ్ఞానం మేరకు మన డింకు టక కార్యకర్తలకి అందించగలను.
  

Saturday, March 15, 2014

DinkuTaka Party NRI Coordinator BN Rao

డింకుటక పార్టీ ఎన్ ఆర్ ఐ కోఆర్డినేటర్ గా బి.ఎన్. రావు

 బుద్దవరపు నరసింహారావుగారు (వీరిని రావుగారనే అంతా పిలిస్తుంటారు. వీరు తరంగ డిజిటల్ నెట్ వర్క్స్ సీఈఓగా ఉన్నారు. రావుగారు మన డింకుటకా పార్టీకి మేసేజ్ పంపారు. అదేమంటే- Count me in for all NRI coordination. అయ్యా, రావుగారూ మీలాంటి మేథావులు తప్పకుండా డింకుటక పార్టీలో చేరాలి, కోఆర్డినేషన్ బాధ్యతలు స్వీకరించాలి. మీరు ముందుకు రావడంతో ఇతర దేశాల్లో డింకుటక (అంతర్జాతీయ రాజకీయ వేదిక) బలోపేతమవుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీకు సగౌరవంగా ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాము. మీకు శుభాభివందనాలు - మీ నాగ్ (డింకుటక పార్టీ అధ్యక్షుడు)

I am DinkuTaka, Are you?

డింకుటక పార్టీ అభిమానులారా, మీరంతా మా పార్టీలో చేరండి, మద్దతు పల్కండి. అందుకు మీరు చేయాల్సిందల్లా పేస్ బుక్ లో లేదా బ్లాగ్ లో ఈ సమాచారం కింద కామెంట్స్ రూపంలో ` I am DinkuTaka, Are you? అని తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో టైప్ చేయండి. అంతే మీరు డింకుటక పార్టీలో చేరినట్టే.
  డింకుటక పార్ టీ ఆవిర్భావ కార్యక్రమం తెలుగు తరంగా ఇంటర్నెట్ రేడియో స్టేషన్ లో మార్చి 13వ తేదీ (2013) సాయంత్రం 4-45 నిమిషాలకు జరిగింది. పార్టీ ఆవిర్భవించిన కొద్ది గంటల్లోనే విశేష స్పందన లభించింది. సోషల్ నెట్ వర్క్ ద్వారా అనేక మంది తాము డింకుటకాకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞాతిభివందనాలు.
  మన పార్టీ - డింకుటక ఎవరికీ తలవొంచదు. మరే ఇతర పార్టీలోనూ చేరదు. పైగా దీనికి ఎల్లలు లేవు. రాష్ట్ర, దేశ సరిహద్దులు చీల్చుకుని ఖండాంతరాలకు దూసుకుపోగల సత్తా ఈ డింకుటకాకు ఉంది. అంతేకాదు, ఈ పార్టీకి భాషాపరమైన అడ్డంకులు కూడా లేవని సవినయంగా తెలియజేస్తున్నాను. హిందీ, మరాఠీ, పంజాబీ, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలోనైనా డింకుటక పార్టీ పెట్టుకోవచ్చు. మనందరి లక్ష్యం ఒకటే, ఏదేశమైనా, ఏ ప్రాంతమైనా అవినీతి రహిత నవ్య సమాజాన్ని స్థాపించడమే.
                                                       మీ - నాగ్ (డింకుటక పార్టీ అధ్యక్షుడు)

Friday, March 14, 2014

కేజ్రీవాల్ చీపురు కంటే చేట ఎలా పవర్ ఫుల్ ?

డింకుటక పార్టీకి చేట గుర్తును ఎందుకు ఎంపికచేశారని చాలామంది అడుగుతున్నారు. 
ఎందుకంటే, చీపురు (అవినీతి) చెత్తను చిమ్మేస్తుంది.
నిజమే. కానీ మా చేట అలా చిమ్మేసిన చెత్తను ఆవల ఎత్తి పారేస్తుంది. 
మళ్ళీ కనిపించనంత దూరానికి విసిరి పారేస్తుంది. 
చెత్త చిమ్మేసి మూలన ఉంచినా అవినీతి గాలికి మళ్ళీ గదంతా పేరుకుపోవచ్చు. 
అందుకే మా చేటకే మీరంతా సపోర్ట్ చేయాలని డింకుటక అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతున్నాను. - మీ నాగ్

కొత్త పార్టీ : డింకుటక (ఇంటర్నెట్ తొలి వెటకార రాజకీయ పార్టీ)



హమ్మయ్యా, గత వారం రోజులుగా అనుకుంటున్న పార్టీ ప్రకటించేశాను. 

పార్టీ పేరు : డింకుటక. (అర్థంపర్థం లేనిదని అనుకోవద్దు, అర్థం లేని రాజకీయాలున్న ప్రస్తుత కాలంలో అర్థంలేని పార్టీ ఉంటే తప్పా?)
పార్టీ జెండా: నల్లటి జెండా. మధ్యలో చేట. అవును మా పార్టీ గుర్తు చేట. ఇది చీపురు కంటే చాలా పవర్ ఫుల్.
ఆశయం : అవినీతి ఊబిలో కూరుకుపోయిన రాజకీయాలను వెటకారంతో చెరిగేయడమే. అందుకే ఇంటర్నెట్ లో తొలి వెటకార రాజకీయ పార్టీగా మన డింకుటక ఆవిర్భవించింది. ఇది అంతర్జాతీయ రాజకీయ వ్యంగ్య వేదిక. ఎన్ ఆర్ ఐ మిత్రులు కూడా కలిసివస్తే విదేశాల్లో కూడా డింకుటక విజయభేరి మ్రోగిస్తుందన్నది నా అభిప్రాయం. డింకుటక ఇంటర్నెట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు మీ మద్దతు కోరుకుంటున్నాను. - ఇట్లు మీ నాగ్ (డింకుటక పార్టీ అధ్యక్షులు)